close
Choose your channels

'యూత్ ఫుల్ లవ్' మూవీ రివ్యూ

Monday, July 6, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పుడున్న సినిమాల ట్రెండ్ ఒకటి లవ్, రెండు హర్రర్. అందులో లవ్ విషయానికి వస్తే ప్రేమలో గొప్పతనాన్ని చూపిస్తూ కేవలం కొన్ని పాత్రల చుట్టూ తిరిగే ప్రేమకథలు వస్తుంటే, ప్రేమతో పాటు జీవితం, సమాజం కూడా ముఖ్యమని చెప్పే ప్రేమకథలు వస్తున్నాయి. ఇలా రెండో కోవకు చెందిన చిత్రమే యూత్ ఫుల్ లవ్. ప్రస్తుతం యూత్‌, వారి ఆలోచనా ధోరణి ఎలా వుందని చెప్పడానికి చేసిన ప్రయత్నమే యూత్ ఫుల్ లవ్`. మనోజ్‌ నందం హీరోగా వేముగంటి దర్శకత్వంలో రాధారం రాజలింగం నిర్మించిన ఈ చిత్రం యూత్ ని ఆకట్టుకుంటుందా? అని తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే...

కథ

తండ్రి చనిపోవడంతో తల్లి పెంపకంలో పెరిగిన వెంకట్(మనోజ్ నందం) మధ్య తరగతికి చెందినవాడు. చిన్నప్పట్నుంచి స్వేచ్ఛగా ఉంటుంటాడు. చదువుతో పాటు కరాటే కూడా జీవనశైళికి అవసరమని నమ్మి ప్రాక్టీస్ చేస్తుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ మేఘన(ప్రియదర్శిని)ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. తనని రేవ్ పార్టీలో కొందరు రేప్ చేయాలని ప్రయత్నిస్తారు. ఆమె ఆక్కడి నుండి తప్పించుకుంటుంది. పోలీసులు కేసు పెట్టినా తన కంపెనీ ఉద్యోగులను వదిలేయమని రిక్వెస్ట్ చేసేంత మంచి అమ్మాయి. ఓ సందర్భంలో వెంకట్ ప్రమాదంలో ఉన్న మేఘన ప్రాణాలను కాపాడతాడు. దాంతో మేఘన వెంకట్ ను ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇలా కథ సాగుతుండగా మరో వైపు మాఫియా గ్యాంగ్స్ ముక్తార్ ఖాన్ లు హైదరాబాద్ సిటీ రౌడీలు, గూండాల చేతిలో ఉండకూడదని తమ ఆధీనంలో ఉండాలని, అతనికి డబ్బు ఆశ చూపిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ముక్తార్ ఖాన్ కొంత మంది అనుచరులను తయారు చేస్తాడు. వారిలో విజయ్(అజిత్) ముఖ్యుడు. విజయ్ ఓ సందర్భంలో మేఘనను చూసి ఇష్టపడతాడు. ఆమె వెంటపడటమే కాకుండా, వెంకట్ ను అవమానిస్తుంటాడు. మేఘన తనకి ఇద్దరంటే ఇష్టమని చెప్పడంతో వెంకట్ షాక్ అవుతాడు. సిటీలో జరుగుతున్న దాడులకు ముక్తార్ ఖాన్ గ్యాంగే కారణమని కమీషనర్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్, వెంకట్ గురువు థ్రిల్లర్ మంజుని కోరుతాడు.

అప్పుడు థ్రిల్లర్ ముంజు ఏం చేస్తాడు? అసలు మేఘన ఇద్దరూ ఇష్ఠమని ఎందుకు చెబుతుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

సమీక్ష

హీరో వెంకట్‌గా, మధ్య తరగతి యువకుడిగా, లవర్ బోయ్ గా మనోజ్‌ నందం తనకి వున్న పరిధిలో ఆకట్టుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తనకి ఈ సినిమా పరంగా ఎంతో ఉపయోగపడిందని చెప్పాలి. మేఘనగా ప్రియదర్శిని మంచి నటనను ప్రదర్శించింది. ఒక విధంగా సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. తను ఫుల్ గ్లామర్ పాత్రలో కనిపించింది. మార్షల్‌ ఆర్ట్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా థ్రిల్లర్‌ మంజు చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేశాడు. విలన్‌గా నటించిన అజిత్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. కొత్త కుర్రాడు నవీన్‌ మార్షల్‌ ఆర్ట్స్ ని బాగా ప్రదర్శించాడు. ఇక దర్శకుడు వేముగంటి కథలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. అయితే కథ రాసుకున్న తీరు అతుకులు బొతుకులుగా ఉంది. కథనంలో క్లారిటీ మిస్సయింది. ఇవన్నీ పక్కన పెడితే శ్రావణ్ కుమార్ సినిమాటోగ్రఫీ మేజర్ మైనస్ అయింది. సినిమాలో క్వాలిటీ మిస్సయింది. శ్రీకాంత్ దేవా సంగీతం పరవాలేదు. సునీల్ కశ్యప్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సో సో గానే ఉంది. కుమారి శ్రేష్ఠ పాటలకు అందించిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. సినిమాలో వున్న నాలుగు పాటలు, నాలుగు వేరియేషన్స్ లోపాటలోని ప్రతి మాట అర్థమయ్యేలా వుంటుంది. పిక్చరైజేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. ఎడిటింగ్ అసలు బాగా లేదు. హీరోయిన్ ఆఫీస్ అంటే ఒక ఫ్రేమ్ ను మాటిమాటికీ చూపిస్తున్నారు. అది చూపించాల్సిన అవసరమే లేదు. ఎడిటింగ్ లో తీసేసి ఉండవచ్చు ఇది ఒక ఉదాహరణ. సినిమా కూడా ముక్కలు ముక్కలుగా ఉంది. ఫ్లో మిస్సయింది.

విశ్లేషణ

అమ్మాయిలు తమని తాము కాపాడుకోవడానికి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం అవసరం అనే పాయింట్‌ బాగున్నప్పటికీ దాన్ని చెప్పిన తీరు గందరగోళంగా మారింది. ప్రేమ గురించి చెప్పాలనుకున్నాడో, మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాధాన్యం గురించి చెప్పాలనుకున్నాడో ఆడియన్‌కి అర్థం కాని పరిస్థితిలో సినిమా వుంటుంది. కథ, కథనాల్లో డైరెక్టర్‌ కాస్తా శ్రద్ధ తీసుకుని ఉండుంటే బావుండేది. మేకింగ్ వాల్యూస్ గురిం చెప్పాలంటే నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనపడదు. కామెడి లేకపోవడం సినిమా మేజర్ మైనస్ పాయింట్. లాజిక్స్ చాలా చోట్ల మిస్సయింది. చివరికి ప్రేక్షకుడు అసలు కథకు టైటిల్ కి సంబంధం ఉందా..అని ఆలోచిస్తూ బయటకి వస్తాడు.

బ్యాటమ్ లైన్: క్లారిటీ లేని యూత్ ఫుల్ లవ్`

రేటింగ్: 1.75/5

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.