అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా డిసెంబ‌ర్ 17న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ ఈవెంట్..

  • IndiaGlitz, [Saturday,December 15 2018]

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది. డిసెంబ‌ర్ 17న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్.

శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌ర‌గ‌బోయే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. కోల్ క‌త్త నేప‌థ్యంలో హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తోన్న అంద‌మైన ప్రేమ‌క‌థ ప‌డిప‌డి లేచె మ‌న‌సు.

విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ముర‌ళి శ‌ర్మ‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లో సుధాక‌ర్ చెరుకూరి ప‌డిప‌డి లేచే మ‌న‌సు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా పడిపడి లేచె మనసు విడుదల కానుంది.