'ఏబీసీడీ' ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ : నిర్మాతలు

  • IndiaGlitz, [Friday,December 28 2018]

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కి స‌మ‌ర్ప‌కులు గా వ్య‌వ‌హ‌రించిన డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

ఈ ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు బాల నటుడు భరత్ ఈ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. 2.5 కోట్లకు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎక్వైరీస్ హ్యూజ్ గా రావటం ఈ చిత్రం క్రేజ్ ని తెలియ‌జేస్తుంది.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మెగా బ్రదర్ నాగబాబు గారు కీలక పాత్రలో నటిస్తున్నారు. మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం.

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్ ను హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. ప్ర‌ముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించటం చాలా ఆనందంగా వుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అని అన్నారు

More News

స్టార్ క‌థానాయిక‌ల జోరు హోరు...

ప్ర‌స్తుత ఏడాది కూడా 150కి పైగా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన‌వే. ఇందులో కొంత మంది కొత్త హీరోయిన్స్ బాక్సాఫీస్ వ‌ద్ద సక్సెస్ అందుకున్నా

'మనసు పలికే మౌన ప్రేమ' నూతన చిత్ర ప్రారంభోత్సవం

ఏ ఎస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై  బాబీ వేంపల్లి దర్శకత్వంలో  నిర్మాత బొట్రేపల్లి ఆవుల కుంట్ల సూర్య ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం 'మనసు పలికే మౌన ప్రేమ'

కొత్త హీరోలు... ప‌రిచ‌య‌మ‌య్యారు!

సినిమా ప‌రిశ్ర‌మ‌కు హీరో డామినేటెడ్ ఇండ‌స్ట్రీ అనే పేరు కూడా చ‌లామ‌ణిలో ఉంది. సినిమా ఓకే కావాలంటే ముందు హీరో ఎవ‌ర‌నేది తెలియాలి.

'ఆర్‌ ఎక్స్‌- 100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో చిత్రం ప్రారంభం

‘ఆర్‌ ఎక్స్‌–100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం

'ఆర్ ఆర్ ఆర్' పై కొత్త క‌థ‌నం...

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్` న‌వంబ‌ర్ 18న సినిమా మొద‌లైంది.