close
Choose your channels

'క్యాష్ క్యాష్' చిత్రం లోని నోట్లరద్ద గీతాన్ని విడుదలచేసిన దర్శకుడు 'బాబీ'  

Wednesday, April 10, 2019 • తెలుగు Comments

క్యాష్ క్యాష్ చిత్రం లోని నోట్లరద్ద గీతాన్ని విడుదలచేసిన దర్శకుడు బాబీ  

తమిళంలో 'థట్రోమ్ థూక్రోమ్' పేరుతో'రూపొందుతున్న చిత్రమ్ 'క్యాష్ క్యాష్' పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. మీడియా మార్షల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అరుళ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మొదటి సింగిల్ 'డిమోనిటైజెషన్ సాంగ్' ను దర్శకుడు బాబీ ఈ రోజు విడుదల చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు అరుళ్ కుమార్ మాట్లాడుతూ "ఈ పాట తమిళంలో ఒక ఉద్రేకంతో జనంలోకి వెళ్ళింది. అలాగే తెలుగు ప్రేక్షకులను ఈ పాట అలాగే ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను లాంచ్ చేసినందుకు స్టార్ డైరెక్టర్ బాబీగారికి నా ధన్యవాదాలు" అని అన్నారు.

అనంతరం దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఈ పాట వినగానే నోట్ల రద్దు సమయంలో ఎదుర్కొన్న కొన్ని వాస్తవిక పరిస్థితులను గుర్తుకు తెచ్చింది. అలాగే ప్రజలు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించిన పద్ధతి నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు డిజే వసంత్ మాట్లాడుతూ.. 'నేను సంగీత దర్శకుడిని అయినా.. తెలుగులో మొట్టమొదటి సారిగా ఈ సినిమా కోసం ఈ పాట రాశాను. ఈ చిత్రబృందం ఓ గీత రచయిత ఉంటే చెప్పండి అని నన్ను అడిగారు. నోట్ల రద్దు టైంలోని పరిస్థితుల గురించి పాట రాయాలి అన్నప్పుడు.. అప్పటి పరిస్థితులు ఎదుర్కున్న వాడిగా నేనెందుకు ఈ పాట రాయకూడదు అనిపించింది. అలా ఈ పాటను రాసాను. బాగా వచ్చింది. మీరందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను' అని చెప్పారు.

క్యాష్ క్యాష్ చిత్రం లోని నోట్లరద్ద గీతాన్ని విడుదలచేసిన దర్శకుడు బాబీ  కాగా ఈ సాంగ్ ను తమిళ్ హీరో శింబు పాడారు. మ్యూజిక్ సెన్స్ ఉన్న శింబు ఈ పాట పాడటం వల్ల పాట చాలా బాగా వచ్చింది. ముందుగా ఈ సినిమా నుండి ప్రతిష్టాత్మక గీతంతో ప్రమోషన్స్ ను మొదలు పెట్టడం ఆనందంగా ఉందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ... 'జీవితంలో ఎదగాలి పెద్దగా డబ్బు సంపాదించాలనుకునే ముగ్గురు అబ్బాయిల చుట్టూ తిరిగే కథ'. ఈ సినిమా ముఖ్యంగా భారత్ లోని ప్రజలు డిమానిటైజెషన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? అనే నేపధ్యంలో ఈ చిత్రం సాగనుంది. త్వరలో ఈ చిత్రం విడుదల తేదీ మరియు చిత్రం యొక్క ఇతర వివరాలు తెలియనున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz