కాజ‌ల్‌... వితౌట్‌..

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

వితౌట్ మేక‌ప్‌తో కాజ‌ల్ పెట్టిన ఫొటోలు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ముఖం మీద తేలిక‌పాటి మ‌చ్చ‌ల‌తో కాజ‌ల్ పోస్ట్ చేసిన ఫొటోల గురించే ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఎప్పుడూ మేక‌ప్‌తో క‌నిపించే కాజ‌ల్ ఉన్న‌ప‌ళాన ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందా అని ప‌లు ర‌కాలుగా ఆలోచిస్తున్నారు.  అలాంటి వారి కోస‌మే కాజ‌ల్ ఇన్‌స్టాలో పెద్ద పోస్ట్ పెట్టారు.'' సామాజిక మాధ్య‌మాలు ఏలుతున్న ఈ రోజుల్లో మనం ఎలా ఉండాల‌నే విష‌యాల‌ను అవి మ‌రింత ఫోక‌స్ చేసి చూపిస్తున్నాయి. ప్ర‌తి ఏటా కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల కోసం ధార‌పోస్తున్నాం. అవ‌న్నీ అవ‌య‌వ‌సౌష్ట‌వాన్ని అందంగా చూపిస్తాయ‌ని అనుకుంటున్నాం. ప్ర‌తిచోటా శ‌రీరాక‌ర్ష‌ణ రాజ్య‌మేలుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌నం సౌంద‌ర్యం కోసం పాకులాడే వాళ్ల‌ల్లో ఉండాలా?  లేకుంటే విడిగా ఉండాలా అనేది ఆలోచించుకోవాలి. ఒక్క మాట చెప్పాలంటే మేక‌ప్ మ‌న బాహ్య సౌంద‌ర్యాన్ని ఇనుమ‌డింప చేస్తుందేగానీ, అంతఃసౌంద‌ర్యాన్ని మారుస్తుందా? మ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తీసుకురాగ‌లుగుతుందా? మ‌నం ఎవ‌రో, ఏమిటో చెప్ప‌గ‌ల‌గుతుందా'' అనేది ఆ పోస్ట్ సారాంశం. 

More News

రంజాన్ కానుకగా జూన్ 7న 'కిల్లర్'

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్‌'..

అనుప‌మ‌.. అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ ఇప్పుడు కొత్త జాబ్  చేస్తున్నారు. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీలో అసిస్టెంట్ డైరక్ట‌ర్‌గా.

రానా... మీరు విన్న‌ది నిజ‌మే

రానా హీరోగా హిర‌ణ్య క‌శ్య‌పుడి క‌థ‌తో ఓ చిత్రం తెర‌కెక్కనున్న‌ట్టు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వింటూనే ఉన్నాం.

సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నవశకానికి నాంది పలికారు.

మోక్ష‌జ్ఞ‌... కాఫీ ల‌వ‌ర్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కోకొల్ల‌లు.