Download App

మెహ‌ర్ ర‌మేశ్ కొత్త బాధ్య‌త‌లు...

కంత్రి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ త‌దుప‌రి ఎన్టీఆర్‌తో శ‌క్తి, ప్ర‌భాస్‌తో బిల్లా, వెంక‌టేశ్‌తో షాడో సినిమా చేశాడు. నాలుగు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయ్యాయి. అయితే మెహ‌ర్ ర‌మేశ్‌కు ఇండ‌స్ట్రీలోని పెద్ద‌ల‌తో మంచి రిలేష‌న్స్ ఉన్నాయి.

ఆ కార‌ణంగా మెహ‌ర్ త‌రుచు ఏదో ఒక ఫంక్ష‌న్ మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తుంటాడు. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల్లో బిజీ కానున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాణ సంస్థ ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను మెహ‌ర్ ర‌మేశ్ పర్య‌వేక్ష‌ణ చేయ‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.  మ‌రి కొత్త బాధ్య‌త‌తో మెహ‌ర్ ర‌మేశ్ ఏం చేస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.