close
Choose your channels

నందమూరి సోద‌రుల డెడికేష‌న్‌

Friday, August 31, 2018 • తెలుగు Comments

నందమూరి సోద‌రుల డెడికేష‌న్‌

తండ్రిని పోగొట్టుకుని నిండా నాలుగు రోజులు కాక‌ముందే నంద‌మూరి సోద‌రులు త‌మ సినిమా షూటింగ్‌ల‌కు వెళ్ల‌డానికి ప్లానింగ్  చేసుకుంటున్నారు. ముంద‌స్తుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం కాల్షీట్‌కి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

శనివారం నుంచి ఎన్టీఆర్ 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌' చిత్రీక‌ర‌ణ‌లో  పాల్గొంటున్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆ సినిమా ద‌స‌రాకు విడుద‌ల కానుంది. పూజా హెగ్డే అందులో నాయిక‌.  మ‌రోవైపు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ సోమ‌వారం నుంచి మ‌హేష్ కోనేరు సినిమాలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శాలిని పాండే, నివేదా థామ‌స్ నాయిక‌లు. కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.