close
Choose your channels

రామ్ చరణ్ బోయపాటిల ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

Monday, November 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ చరణ్ బోయపాటిల ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తోంది.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి 'స్టేట్ రౌడీ', 'వినయ విధేయ రామ' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. రేపు మంగళవారం నవంబర్ 6న మధ్యాహ్నం 1 గంటలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే నవంబర్ 9 న ఉదయం 10:25 నిమిషాలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయనున్నట్లు ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు.

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.