close
Choose your channels

ఆర్ ఆర్ ఆర్.. ఓవ‌ర్సీస్ ఎంతో తెలుసా

Thursday, June 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్ ఆర్ ఆర్.. ఓవ‌ర్సీస్ ఎంతో తెలుసా

సినిమా మొద‌ల‌వుతుందంటే హీరో ఎవ‌రు? హీరోయిన్ ఎవ‌రు? అని అడిగే రోజులు క్ర‌మేణా తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఏ ఏరియాకు ఎంత బిజినెస్ జ‌రిగింద‌నే అంశాల‌మీదే ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంటోంది. సినిమా షూటింగ్ పూర్తిగా మొద‌లుకాక‌ముందే, కొన్ని స‌న్నివేశాల‌నో, ఒక పాట‌నో చూడ‌నైనా చూడ‌క‌ముందే వ్యాపారం జ‌రుగుతోంది.

తాజాగా ఆర్ ఆర్ ఆర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఇంకా షూటింగ్ ఓ కొలిక్కి రాలేదు. ఆ మాట‌కొస్తే ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే నాయిక విష‌యం కూడా ఇంకా తేల‌లేదు. ఇలాంటి స‌మ‌యంలోనే ఆర్ ఆర్ ఆర్ విదేశీ హ‌క్కులు అన్ని భాష‌ల‌కూ సంబంధించి రూ.65కోట్ల‌కు అమ్ముడ‌య్యాయ‌ని టాక్‌.

దుబాయ్‌కి చెందిన వ్యాపార‌వేత్త ఈ రైట్స్ తీసుకున్న‌ట్టు స‌మాచారం. అత‌నే గ‌తంలో నిర్మాత డీవీవీ దాన‌య్య‌ను సంప్ర‌దిస్తే రూ.70 కోట్లు చెప్పార‌ట‌. తాజాగా చైనా త‌ప్ప మిగిలిన దేశాల్లో అన్ని భాష‌ల హ‌క్కుల‌ను రూ.65కోట్ల‌కు విక్ర‌యించేశార‌ట‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.