చైతూకు సమంత కాకుండా ఇంకొకరు కూడానట

  • IndiaGlitz, [Tuesday,November 06 2018]

అక్కినేని నాగ చైతన్య హీరోగా 'నిన్ను కోరి' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయినా శివ నిర్వాణం దర్శకత్వంలో 'మజిలీ' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే! పెళ్లి అయిన తర్వాత మొదటి సారి సమంత తో కలిసి నటిస్తున్నాడు చైతు. పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య ఉండే గొడవలు ప్రేమ బంధల నేపధ్యంలో ఈ చిత్ర కథ సాగనుందట. అయితే ముందు నుంచి ఈ చిత్రంలో సమంత ఒక్కరే హీరోయిన్ గా నటిస్తోందని అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో సమంత కాకుండా రెండో హీరోయిన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ పాత్ర నిడివి చాల తక్కువగానే ఉందనున్నప్పటికీ సినిమాకి ఆ పాత్రే చాల కీలకం అట. మరి ఆ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో నాగ చైతన్య పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండనుంది.

ఇటీవలే నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో చేసిన 'సవ్యసాచి' ఆశించినంత విజయం సాధించకపోవడంతో శివ నిర్వాణ తో చేస్తున్న 'మజిలీ' చిత్రం పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.