close
Choose your channels

'రేయ్'తో పూర్వ వైభవం

Tuesday, November 26, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెలోడీ పాటలకైనా. బీట్ ఓరియెంటెడ్ పాటలకైనా చిరునామాలా ఉండే సంగీత దర్శకులలో చక్రి ఒకరు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు తన వంతుగా న్యాయం చేసే ఈ సంగీత దర్శకుడు కెరీర్ లో. చాలానే మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా గ్రహణం పట్టినట్లుగా చక్రి కెరీర్ కాస్తంత మసకబారింది. తనను ప్రోత్సహించిన పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులు. రవితేజ లాంటి హీరోలు సైతం వేరే మ్యూజిక్ డైరెక్ట ర్ల తో పనిచేస్తుండడంతో చక్రి హవా బాగా తగ్గిపోయింది.

అయితే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలలో ఒకటైన 'రేయ్'తో. పూర్వవైభవం పొందుతానన్న ధీమాతో చక్రి ఉన్నాడని అతని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. 'దేవదాసు' వంటి సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్ మూవీ తరువాత వై.వి.ఎస్. చౌదరితో చక్రి పనిచేస్తున్న సినిమా కావడంతో 'రేయ్' పై యూత్లో బాగానే అంచనాలే ఉన్నాయి.

అందునా చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ తొలి చిత్రం కావడం. డ్యాన్సులకి మస్త్ గా అవకాశం ఉండడంతో 'రేయ్'కి తన వంతుగా ఏ రేంజ్ లో కష్టపడాలో అంత పడి మరీ మ్యూజిక్ ఇచ్చాడట చక్రి. రేపు ఆడియో విడుదలై. పాటలతో పాటు సినిమా కూడా మంచి హిట్ పొందితే. చక్రికి పూర్వవైభవమే కాదు మునుపటిలా పెద్ద హీరోల సినిమాలూ చేతికొచ్చేస్తాయంటున్నారు మన సినీ పండితులు.

Follow us on Google News and stay updated with the latest!