close
Choose your channels

23న 'అగ్గిరవ్వ' ఆడియో

Friday, June 6, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Aggiravva Gallery
View Aggiravva Gallery
శ్రీధన్ మీడియా బ్యానర్ పై కోమగన్ ఎ.ఎల్.రాజా దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంతో రూపొందుతోన్న చిత్రం ‘అగ్గిరవ్వ’. స్వర్గీయ శ్రీహరి బావమరిది జయరాం కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకోంటుంది. ఈ సందర్భంగా..
నిర్మాత ఎస్.భూపతి మాట్లాడతూ ‘’ఈ సినిమా ద్వారా డిస్కో శాంతి తమ్ముడు జయరాం హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో విద్యను ఎటువంటి తార్యతమ్యం లేకుండా అందిస్తే ఎటువంటి లాభాలు వస్తాయో చూపిస్తున్నాం. ఆడియో విడుల కార్యక్రమం ఈ నెల 23న చేస్తున్నాం అన్నారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తైనాయి. జూలై నెలలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, భానుప్రియ, సుమన్ శెట్టి, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, కెమెరా: శివరాం, నిర్మాత: ఎస్.భూపతి, కథ, కథనం, దర్శకత్వం: ఎ.ఎల్.రాజా.

Follow us on Google News and stay updated with the latest!