close
Choose your channels

8న రామయ్యా వస్తావయ్యా పాటలు

Wednesday, August 28, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ కు , తమన్ ఎలాంటి పాటలు ఇస్తారో ఇంతకు ముందే జనాలు రుచిచూశారు. ఇప్పుడు వారిద్దరికి హరీష్ శంకర్ కూడా తోడయ్యాడు. పాటలు ఇంకెలా ఉంటాయో ఊహించుకోవచ్చు. దిల్ రాజు నిర్మిస్తున్న రామయ్యా వస్తావయ్యా సినిమా గురించే ఇదంతా. ఈ సినిమాలోని పాటలను సెప్టెంబర్ 8న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. ఎన్టీఆర్ తో పాటు శ్రుతిహాసన్, సమంత కూడా స్పెయిన్ లోనే ఉన్నారు. పాటలను చిత్రీకరిస్తున్నారు. ఆ టీమ్ ఇక్కడికి రాగానే సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో పాటలను విడుదల చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు సిద్ధంగా ఉన్నారట.

Follow us on Google News and stay updated with the latest!