Download App

తెలుగు మూవీని రీమేక్ చేస్తున్న విజ‌య్ ఆంటోని...

న‌కిలీ, డా.స‌లీమ్ చిత్రాల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని బిచ్చగాడు స‌క్సెస్‌తో పెద్ద క‌మ‌ర్షియ‌ల్ మార్కెట్‌ను తెలుగులో క్రియేట్ చేసుకున్నాడు. త‌ర్వాత ఈయ‌న చేసిన సినిమాలు పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోయినా.. విజ‌య్ ఆంటోని సినిమాల‌కు క్రేజ్ ఉంది.

ఈ క్రేజ్‌ను పొగొట్టుకోకుండా ఉండాల‌ని విజ‌య్ ఆంటోని ప్ర‌య‌త్నాలు మాత్రం మానుకోవ‌డం లేదు. అయితే తెలుగులో ఓ సినిమాను త‌మిళంలో రీమేక్ చేయ‌బోతున్నాడ‌ట ఈ హీరో. తెలుగులో నెపోలియ‌న్ పేరుతో ఆనంద్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రమిది.

ఇందులో నీడ‌పోయింది అనే కాన్సెప్ట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. అయితే దాని వెనుక కార‌ణ‌మేంట‌నేదే అస‌లు క‌థ‌. స్పస్పెన్స్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌.