సెప్టెంబర్‌ 29న విశాల్‌ 'పందెం కోడి 2' ట్రైలర్‌

  • IndiaGlitz, [Thursday,September 27 2018]

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'. గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన 'పందెంకోడి' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది.

ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'పందెంకోడి 2'. ఈ చిత్రం ట్రైలర్‌ను సెప్టెంబర్‌ 29న రిలీజ్‌ చెయ్యబోతున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'పందెంకోడి 2' చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్‌ మధు తెలిపారు.

మాస్‌ హీరో విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి.

More News

'నాటకం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నాటకం'.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకుడు.

'ఐశ్వ‌ర్యాభిమ‌స్తు' మ్యూజిక్ లాంచ్‌

శ్రీమ‌తి వ‌రం మాధ‌వి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆర్య‌, విశాల్, సంతానం, త‌మ‌న్నా, భాను న‌టించిన చిత్రం 'ఐశ్వ‌ర్యాభిమ‌స్తు'.

'విశ్వదాభిరామ' ఫస్ట్ లుక్ లాంఛ్

చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వదాభిరామ'. సురేష్ కాశి, సురేంద్ర కమల్, అశోక్‌చక్రం దర్శకత్వం వహిస్తున్నారు.

తొలి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నభా నటేష్

తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతోమంది పరభాషా నాయికలు వస్తున్నారు. అలా వచ్చినవారంతా ఏదో ఒక ముద్ర వేస్తున్నారు.

హైద‌రాబాద్ & విజ‌యవాడ‌ల్లో నోటా ప‌బ్లిక్ మీట్..

నోటా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. విడుద‌ల‌కు ముందే విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ ల‌లో రెండు భారీ ప‌బ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు.