ధ ధ..ధైర్యానికి జై కొట్టిన కోటి మంది...

  • IndiaGlitz, [Sunday,July 09 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న సినిమా 'జై ల‌వ‌కుశ‌'. ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు సంబంధించిన మూడు పాత్ర‌ల్లో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న జై పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్‌లో ధ ధ ధైర్యం ఉందా అంటూ న‌త్తిగా ఎన్టీఆర్ చెప్పే డైలాగ్, లుక్ అన్నింటికీ ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇర‌వై నాలుగు గంటల్లో 7.8 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌తో ద‌క్షిణాది సినిమాల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా కోటి వ్యూస్ రాబ‌ట్టుకుంది. ఇప్పుడు సినిమాలో ఎన్టీఆర్ చేసిన మిగిలిన రెండు పాత్ర‌ల తీరు తెన్నులు ఎలా ఉంటాయ‌నేది అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది.