పవన్ కాకినాడ సభలో ఒకరు మృతి

  • IndiaGlitz, [Friday,September 09 2016]

జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు కాకినాడ‌లో సీమాంధ్రుల ఆత్మ‌గౌర‌వం పేరుతో బ‌హిరంగం స‌భ‌ను ఏర్పాటు చేసారు. ఈ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్రం ఇచ్చింది ప్యాకేజ్ కాదు పాచిపోయిన ల‌డ్డు. ఈ పాచిపోయిన ల‌డ్డు తీసుకుంటారో..? విసిరి వాళ్ల ముఖం పై కొడ‌తారా..? మీ ఇష్టం అంటూ నిర్ణ‌యం చంద్ర‌బాబుకే వ‌దిలేసారు. ఇదిలా ఉంటే.... స‌భ పూర్త‌యిన అనంత‌రం తొక్కిస‌లాట జ‌రిగింద‌ట‌. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌ర‌కి గాయాల‌య్యాయి అని స‌మాచారం. వారిలో ఒక‌రు చికిత్స పొందుతూ మృతి చెందారు. మ‌ర‌ణించిన అభిమానిని తూర్పు గోదావ‌రి జిల్లా ద్రాక్షారామం మండ‌లం కుయ్యేరుకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. చికిత్స పొందుతున్న మ‌రో అభిమానిని వై.రామ‌వ‌రం గ్రామ‌స్థుడుగా గుర్తించారు.

More News

నేను - నాన్న అద్భుతమైన క్షణాలు - ప్రభుదేవా

తనదైన శైలిలో డ్యాన్స్ చూసి...యూత్ ను ఎంతగానో ఆకట్టుకుని ఇండియన్ మైకేల్ జాక్సన్ అనిపించుకున్న గ్రేట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా.

జనతా గ్యారేజ్ కి విక్టరీ అభినందనలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం జనతా గ్యారేజ్.

జ్యోఅచ్యుతానంద గురించి రాజమౌళి రివ్యూ..!

నారా రోహిత్-నాగ శౌర్య-రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ జ్యోఅచ్యుతానంద.

ఈనెల 11న అభినేత్రి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

70కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు,హిందీ,తమిళ భాషల్లో ప్రభుదేవా,మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో

గోపీచంద్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభ‌మైయ్యాయి

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.