37 రోజులు.. 10 ఫస్ట్ లుక్స్

  • IndiaGlitz, [Monday,January 01 2018]

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు యువ క‌థానాయ‌కుడు నేచుర‌ల్ స్టార్ నాని. తాజాగా ఎం.సి.ఎతో త‌న ఖాతాలో మ‌రో స‌క్సెస్‌ని జ‌మ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. త‌నే ప్రొడ్యూస‌ర్‌గా వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై అ! అనే చిత్రాన్ని నాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ వ‌ర్మ అనే నూత‌న ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా, ఈషా రెబ్బా, ముర‌ళీ శ‌ర్మ‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇందులో ఉండే బోన్సాయ్ చెట్టు పాత్ర‌కి ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ అందివ్వ‌నుండ‌గా.. చేప పాత్ర‌కి నాని వాయిస్ ఓవ‌ర్ అందించ‌నున్నారు. కాగా, న‌వంబ‌ర్ 25న విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ మొద‌లుకుని.. ఈ రోజు (ఆదివారం) విడుద‌లైన కాజ‌ల్ ఫ‌స్ట్ లుక్ వ‌ర‌కు ప‌రిశీలిస్తే.. 37 రోజుల గ్యాప్‌లో 10 ఫ‌స్ట్ లుక్స్‌ని విడుద‌ల చేసి.. సినిమాపై ఆస‌క్తిని పెంచింది చిత్ర బృందం. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.