10న అల్లరి 'బందిపోటు'

  • IndiaGlitz, [Tuesday,June 03 2014]
View Allari Naresh Gallery

ప్రముఖ దర్శకులు స్వర్గీయ ఇ.వి.వి.సత్యనారాయణ స్థాపించిన ఇ.వి.వి.సినిమా సంస్థ బాధ్యతలను ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్ స్వీకరించారు. ఆయన సారథ్యంలో ఇ.వి.వి.సినిమా సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘బందిపోటు’ వివరాలను ఆయన వెల్లడించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ‘బందిపోటు’ చిత్రం రూపొందించేందుకు ఆర్యన్ రాజేష్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ ‘’నాన్నగారి తదనంతరం ఇ.వి.వి.బ్యానర్ బాధ్యతలను చేపడుతూ ఇక వరుస చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. జూన్ 10 నుండి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా బందిపోటు సినిమా ప్రారంభం కానుంది. అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్. త్వరలో మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు.