close
Choose your channels

టీడీపీకి భారీ షాక్.. 11 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై!?

Tuesday, May 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీకి భారీ షాక్.. 11 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై!?

ఏపీలో తెలుగుదేశం పని అయిపోనట్లేనా..? తెలంగాణలాగా ఏపీలో సైకిల్ పార్టీ ఖాళీ కానుందా..? ఆఖరికి నారా, నందమూరి ఫ్యామిలీలు మాత్రం మిగులుతాయా..? పార్టీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతోందా..?.. బాబు, చిన్నబాబు తీరు నచ్చక.. కొంత మంది సొంత పార్టీకి వ్యతిరేకంగా మారారా..?.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సైతం అస్తమాను వ్యతిరేకిస్తుండటంతో ఇక టీడీపీలో ఉండటానికి వీల్లేదని మరికొంత ఎమ్మెల్యేలు ‘సైకిల్’ దిగి ‘ఫ్యాన్’ కిందికి చేరి సేద తీరడానికి సిద్ధమవుతున్నారా..? మొత్తమ్మీద 11 మంది ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు.. చంద్రబాబుకు కలలో కూడా ఊహించని రీతిలో షాక్ ఇవ్వబోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమని తెలుస్తోంది. ఇంతకీ ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరు..? ఎప్పుడు చేరుబోతున్నారు..? సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారందర్నీ సాదారంగా ఆహ్వానిస్తారా..? లేదా తిరస్కరిస్తారా..? అనేదానిపై www.indiaglitz.com స్పెషల్ స్టోరీ.

రెడీగా ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వీరే..

01. వాసుపల్లె గణేష్ కుమార్..(విశాఖ సౌత్)
02. గణ బాబు..(విశాఖ వెస్ట్)
03. గొట్టిపాటి రవి(అద్దంకి)
04. ఏలూరి సాంబశివరావు(పర్చూరు)
05. గంట శ్రీనివాసరావు(విశాఖ నార్త్)
06. బాల వీరాంజనేయులు(కొండెపి)
07. మంతెన రామరాజు(ఉండి)
08. అనగాని సత్యప్రసాద్(రేపల్లె)
09. జోగేశ్వర రావు(మండపేట)
10. పయ్యాల కేశవ్(ఉరవకొండ)
11. .బి.అశోక్(ఇచ్చాపురం)

ఎవరెప్పుడు..!?

కాగా ఈ 11 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు పయ్యావుల, అశోక్ మాత్రం ఊగిసలాటలో ఉన్నట్లు తెలియవచ్చింది. మిగిలిన 09 మంది ఎమ్మెల్యేలు మాత్రం విడతల వారిగా వైసీపీలో చేరతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఈ లిస్టులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది మొదట్నుంచే చాలా మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని పలువురు మంత్రులు, ముఖ్యనేతలు మీడియా ముందుకొచ్చి చెప్పారు. అయితే ఈ విషయాన్ని అందరూ లైట్ తీసుకున్నారు.. టీడీపీ అయితే ఈ విషయాన్ని అస్సలే పట్టించుకోలేదు.. కనీసం నిలువరించడానికి కూడా ప్రయత్నాలు చేయలేదు.

ఇవాళ ఇద్దరు చేరిక..!?

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఒంగోలు వెళ్లిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. బాలినేనితో భేటీ అయ్యారు. ఈ మేరకు పార్టీలో చేరికపై నిశితంగా చర్చించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికాసేపట్లో లేదా ఇవాళ సాయంత్రం లోపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే.. ఇందుకు సంబంధించి అన్ని చర్చలు అయిపోయాయని.. కొద్దిసేపట్లో మంత్రి బాలినేనితో కలిసి నేరుగా తాడేపల్లికి ఆ ఇద్దరు నేతలు వెళ్లనున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్.. వైసీపీ అభ్యర్థిపై గెలుపు సాధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏలూరి సాంబశివరావు.. ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి.. దగ్గుబాటి వెంకటేశ్వర్రావుపై విజయం సాధించారు. వాస్తవానికి వీరిద్దరూ ఫలితాలు వచ్చిన నాటి నుంచే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ పరిస్థితులు చక్కబడతాయ్.. తామున్న సొంతపార్టీకి మంచి రోజులొస్తాయని భావించారు. కానీ రోజురోజుకు రాష్ట్రంలో పరిణామాలు మారిపోతుండటం.. జగన్ చేపట్టే అభివృద్ధి పనులను చూసిన ఆ ఇద్దరు వైసీపీలోకి జంప్ అవుతున్నారు.

మిగిలేది ఆ రెండు కుటుంబాలేనా..!?

పైన జాబితా నిజమే అయితే మాత్రం ఏపీలో టీడీపీ పని అయిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు, మాజీలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో లాగే ఏపీలో కూడా ‘సైకిల్’ సామాన్లు సర్దుకోవాలని వైసీపీ నేతలు పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం టీడీపీకి టాటా చెప్పేశారు. జగన్‌ను కూడా కలిసి ప్రస్తుతం అటు ఇటు కాకుండా ఉన్నారు. వాళ్లు ముగ్గురు.. ఇప్పుడు మరో 11 మంది అంటే.. మొత్తం 14 మంది అంటే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కరనక్కర్లేదు. ఇక మిగిలిందల్లా ఒకరిద్దరు ఎమ్మెల్యులు మాత్రమే. ఇక నారా, నందమూరి కుటుంబాలు మాత్రమే మిగిలపోన్నాయని వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ జాబితా గత వారంరోజుగా నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారో..!?

కాగా ఇంత మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తారంటే.. అసలు సీఎం వీరందర్నీ ఆహ్వానిస్తారా..? లేదా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ముగ్గురు టీడీపీకి దూరమై ప్రత్యేక సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ 11 మంది రాజీనామా చేసి పార్టీలో చేరుతారా..? లేకుంటే ప్రత్యేక సభ్యులుగానే ఉండిపోతారా..!? అనే విషయం తెలియాల్సి ఉంది. అంతిమంగా సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై అటు టీడీపీ.. ఇటు వైసీపీ నేతలు వేచి చూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.