close
Choose your channels

ఏపీ ఎన్నికల్లో 12 మంది మంత్రులకు ఓటమేనట!

Thursday, April 18, 2019 • తెలుగు Comments

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన మంత్రులే కాదు సీనియర్లు, రాజకీయ ఉద్ధండులు అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులకు, ఆ ఉద్ధండులకు ఎంత మంచి పేరుందో అర్థం చేస్కోవచ్చు. ఇందుకు కారణం ఎన్నడూ నియోజకవర్గం వైపు తొంగిచూడకుండా ఆఖరి నిమిషంలో వెళ్లి ఓట్లేయమని అడగటమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సేమ్ టూ సేమ్ ఇదే సీన్ ఏపీ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఓటమిపాలయ్యే మంత్రుల జాబితా సైతం ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఓడిపోయే మంత్రులు వీరేనట

దేవినేని ఉమామహేశ్వరరావు

నారా లోకేశ్

కింజరపు అచ్చెన్నాయుడు

గంటా శ్రీనివాసరావు

అయ్యన్న పాత్రుడు

పరిటాల శ్రీరామ్ (సునీత కుమారుడు)

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాల్వ శ్రీనివాసులు

భూమా అఖిల ప్రియ

ఆది నారాయణరెడ్డి

పొంగూరి నారాయణ

పితాని సత్యనారాయణ

ఈ మంత్రులు ఎక్కడ్నుంచి పోటీ చేశారు.. వీరిపై పోటీ చేసిందెవరు..?

మైలవరం:-

వైసీపీ : వసంత కృష్ణప్రసాద్‌

టీడీపీ : దేవినేని ఉమామహేశ్వరరావు

జనసేన+ : ఎ. రామ్మోహన్‌ రావు

కాంగ్రెస్ : బొర్రా కిరణ్‌

బీజేపీ :నూతలపల్లి బాల కోటేశ్వరరావు 

మంగళగిరి:-

వైసీపీ : ఆళ్ల రామకృష్ణారెడ్డి

టీడీపీ : నారా లోకేష్‌

జనసేన + : ఎమ్‌. నాగేశ్వర్రావు

కాంగ్రెస్ : ఎస్‌కే సలీం

బీజేపీ : జగ్గారపు రామ్మోహన్‌రావు

టెక్కలి:-

వైసీపీ : పేరాడ తిలక్‌

టీడీపీ : కింజరాపు అచ్చెన్నాయుడు

జనసేన : క‌ణితి కిర‌ణ్ కుమార్

కాంగ్రెస్ : చింతాడ దిలీప్‌కుమార్‌

బీజేపీ : ఉదయ్ భాస్కర్

విశాఖ నార్త్:-

వైసీపీ : కమ్మిల కన్నపరాజు

టీడీపీ : గంటా శ్రీనివాసరావు

జనసేన : పసుపులేటి ఉషా కిరణ్‌

కాంగ్రెస్ : గంప గోవిందరాజు

బీజేపీ : విష్ణుకుమార్‌ రాజు

నర్సీపట్నం:-

వైసీపీ : పి.ఉమాశంకర్‌ గణేష్‌

టీడీపీ : అయ్యన్నపాత్రుడు

జనసేన + : వేగి దివాకర్‌

కాంగ్రెస్ : మీసాల సుబ్బన్న

బీజేపీ : గాదె శ్రీనివాసరావు

రాప్తాడు:-

వైసీపీ : తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

టీడీపీ : పరిటాల శ్రీరామ్‌

జనసేన + : సాకె పవన్‌ కుమార్‌

కాంగ్రెస్ : జనార్దన్‌రెడ్డి

బీజేపీ : యెర్రీ స్వామి

సర్వేపల్లి:- 

వైసీపీ : కాకాణి గోవర్థన్‌రెడ్డి

టీడీపీ : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

జనసేన + : పట్టపు రవి

జనసేన + :  సుంకర హేమలత

కాంగ్రెస్ : పూల చంద్రశేఖర్‌

బీజేపీ : పేరిచర్ల బైరప్ప

రాయదుర్గం :- 

వైసీపీ : కాపు రామచంద్రారెడ్డి

టీడీపీ : కాల్వ శ్రీనివాసులు

జనసేన +:     కె. మంజునాథ్‌ గౌడ్‌

కాంగ్రెస్ : ఎంబీ చిన్నప్పయ్య

బీజేపీ : బీజే వసుంధర దేవీ

ఆళ్లగడ్డ:-

వైసీపీ : గంగుల బీజేంద్రరెడ్డి

టీడీపీ : భూమా అఖిలప్రియ

కాంగ్రెస్ : చాకలి పుల్లయ్య

బీజేపీ : శూలం రామకృష్ణుడు

కడప పార్లమెంట్:- 

వైసీపీ : వైఎస్‌ అవినాష్‌రెడ్డి

టీడీపీ : ఆది నారాయణరెడ్డి

జనసేన +: ఈశ్వరయ్య

కాంగ్రెస్ : జీ. శ్రీరాములు

బీజేపీ : సింగిరెడ్డి రాంచంద్రారెడ్డి

నెల్లూరు సిటీ:- 

వైసీపీ : అనిల్‌కుమార్‌ యాదవ్‌

టీడీపీ : పొంగూరు నారాయణ

జనసేన +: కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కాంగ్రెస్ : షేక్‌ ఫయాజ్‌

బీజేపీ : కె జగన్మోహన్‌రావు

ఆచంట:- 

వైసీపీ : చెరుకువాడ శ్రీరంగనాథరాజు

టీడీపీ : పితాని సత్యనారాయణ

జనసేన + :  వెంక‌ట విజ‌య‌రామ్‌

కాంగ్రెస్ : వెంకట సత్యనారాయణ

బీజేపీ : ఏడిద కొదండ చక్రపాణి

కాగా.. ఈ 12 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా ఈ మంత్రులంతా రెండోస్థానానికి మూడో స్థానానికి పరిమితం అవుతారని టాక్ నడుస్తోంది.

కొన్ని నియోజకవర్గాల్లో ఆఖరి నిమిషంలో ఆయా టీడీపీ మంత్రుల ప్రధాన అనుచరులు పార్టీ మారడం, నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేకపోవడం, గ్రామస్థాయిలో టీడీపీ పై వ్యతిరేకత ఉండటం, జనసేన వల్ల ఓట్లు చీలడంతో వైసీపీ లాభం చేకూరుతుందని తద్వారా ఈ మంత్రులు ఓటమిపాలవుతారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు లాస్ అవుతారో.. అసలు విషయం తెలియాలంటే మే-23వరకు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz