సైకిల్ తొక్కుతూ వెళ్లి.. శవంగా తిరిగొచ్చింది..

  • IndiaGlitz, [Friday,September 18 2020]

అందం.. అల్లరి కలగలిపి కూతురి రూపంలో తమ కళ్ల ముందు తిరుగుతుంటే.. ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కూతురి సంతోషం కోసం సైకిల్ కొనిచ్చి.. ఆనందంగా తమ కళ్లు ముందు తొక్కుతుంటే మురిసిపోయారు. అంతా హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలో పెను విషాదం. అప్పటి వరకూ తమ కళ్ల ముందే సైకిల్ తొక్కుతూ కనిపించిన చిన్నారి అదృశ్యమైంది. వెదికి వేసారిన ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చివరకు.. సంతోషంగా.. చెలాకీగా తమ కళ్ల ముందు తిరిగిన ముద్దుల కూతురు విగత జీవిగా ఓ నాలాలో కనిపించడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది..

అసలు విషయంలోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజిగిరి నేరెడీమేట్ సంతోషిమా కాలనీకి చెందిన సుమేధ కపురియా(12)ను గురువారం సాయంత్రం వర్షం లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు సైకిల్ తొక్కుకునేందుకు అనుమతించారు. అయితే ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ వెదికినా కూతురి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని గంటల్లోనే పాప జాడ కనుక్కున్నారు. అయితే ఆ పాప విగతజీవిగా కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది.

గురువారం సాయంత్ర కురిసిన భారీ వర్షానికి పక్కనే ఉన్న దీన్ దయాల్ నగర్‌లోని నాళాలు పొంగి పొర్లాయని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సుమేధ సైకిల్‌ను నాలా వద్ద గుర్తించారు. వెంటనే రెస్క్యూ టీం తో పాటు జీహెచ్ఎంసీ కూడా రంగంలోకి దిగింది. తీవ్ర స్థాయిలో గాలింపులు జరపగా.. సుమేధ మృతదేహం అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోని బండ చెరువులో లభ్యమైంది. కూతురిని విగతజీవిగా చూసిన సుమేధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో సంతోషిమానగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

More News

డైరెక్టర్ భవాని శంకర్ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ 'క్లైమాక్స్' అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది - హీరో డా. రాజేంద్ర ప్రసాద్

ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డులు గెలుచుకున్న `డ్రీమ్' చిత్ర దర్శకుడు భవాని శంకర్ తాజాగా చేసిన పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్ 'క్లైమాక్స్'.

బిగ్‌బాస్ కోసం రూ.10 లక్షలు కట్టిన అవినాష్..

బిగ్‌బాస్ సీజన్ 4లోకి ముక్కు అవినాష్ గురువారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చుకు దారి తీస్తున్నాయి.

ఇన్నేళ్ల తర్వాతే సిద్ధార్థ్‌కు తెలుగులో అలాంటి సినిమా వచ్చిందా..?

సిద్ధార్థ్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీపై కోపం వచ్చిందా? ఆ కోపం తీరడానికి ఏడేళ్ల సమయం పట్టిందా? ఏమో పరిస్థితులను చూస్తే అలానే అనిపిస్తుంది.

వారికి రాని స‌క్సెస్ స‌మంత‌కు వ‌స్తుందా?

లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేసిన స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని ఇక సెట్స్‌లోకి అడుగుపెట్ట‌డానికి రెడీ అవుతుంది.