తెలుగు రాష్ట్రాల ప్రజల విషయంలో రైల్వే కీలక నిర్ణయం

  • IndiaGlitz, [Monday,May 10 2021]

కరోనా మహమ్మారి దేశమంతా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి అవసరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణల నుంచి ఢిల్లీ వెళ్లే రైలు ప్రయాణికులకు షరతులు విధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రయాణికులంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఆదేశాలు జారీ చేసింది.

‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే రైలు ప్రయాణికులందరూ విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్(రెండు డోసులు) సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన వ్యక్తులెవరైనా ఉంటే మాత్రం వారు ఆ సర్టిఫికెట్‌ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరోనా నెగిటివ్ వచ్చినట్టు సూచించే ఆర్టీపీసీఆర్ రిపోర్టు (ప్రయాణానికి 72 గంటల లోపు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది)ను చూపించిన వారు మాత్రం 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది’’ అని సౌత్ సెంట్రల్ రైల్వే ట్విటర్ వేదికగా వెల్లడించింది.

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కరోనా మహమ్మారి విజృంభించడమే కాకుండా కొత్త వైరస్‌ను డిటెక్ట్ చేశారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే తెలంగాణలోని ఓ జిల్లాలో కనుగొన్న వైరస్ కేవలం మూడు రోజుల్లోనే లంగ్స్‌కు ఎఫెక్ట్ అవుతుందని వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై షరతులు విధిస్తున్నాయి.

More News

అమెరికాలో దిల్ రాజు దంపతుల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ

నిర్మాత దిల్ రాజు, వైఘా రెడ్డిని గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని ఓ గుడిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా

కరోనా ఫస్ట్ వేవ్‌లో పెద్దగా సెలబ్రిటీలెవరూ కరోనా బారిన పడలేదు కానీ సెకండ్ వేవ్‌లో మాత్రం స్టార్ హీరోలంతా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఈటల, కొండా కలిసి కేసీఆర్ సీటుకు ఎసరు పెడతారా?

ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఏమో కానీ కొండా మాత్రం స్పీడ్ పెంచేశారు.

కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం

భారత్‌ను కొవిడ్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలన్న తేడా లేకుండా అంతా కరోనా బారిన పడుతున్నారు.

'పంచతంత్రం'లో విహారిగా నరేష్ అగస్త్య... అతని పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.