ఆ నిర్మాత‌లు లెక్క స‌రిచేస్తున్నారా?

  • IndiaGlitz, [Monday,August 24 2020]

ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థ ఓ లెక్క‌ను స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇంత‌కూ ఏంటా లెక్క‌? అనే వివ‌రాల్లోకెళ్తే.. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ అఖిల్ అక్కినేనితో సినిమా చేయ‌డానికి ఓకే అంది. ఇందులో విష‌య‌మేముంది అనుకోకండి.. విష‌య‌మేమంటే, ఇదే బ్యాన‌ర్‌లో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగ‌చైత‌న్య సినిమా చేయాల్సింది. సినిమాను కూడా స్టార్ట్ చేశారు. కానీ.. పరుశురామ్‌కు, స‌ద‌రు నిర్మాణ సంస్థ‌కు మ‌హేశ్‌తో సినిమా చేసే అవ‌కాశం రావ‌డంతో చైతు సినిమాను ప‌క్క‌న పెట్టేశారు. ఈ విష‌యంపై నాగార్జున కాస్త సీరియ‌స్ అయ్యార‌ని కూడా వార్త‌లు వినిపించాయి.

అయితే ఇప్పుడు ఈ నిర్మాత‌లు నాగ్‌ను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అఖిల్ నెక్ట్స్ మూవీని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నార‌ట‌. నిజానికి ఈ చిత్రాన్ని క్రిష్‌, రాజీవ్ రెడ్డి నిర్మించాల్సింది. కానీ భారీ బ‌డ్జెట్ కార‌ణంగా క్రిష్‌, రాజీవ్ రెడ్డి త‌ప్పుకున్నారు. ఆ స్థానంలో ఇప్పుడు రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట సినిమాలు చేయ‌డానికి ముందుకు వ‌చ్చార‌ట‌. ఇలా అన్న‌తో త‌ప్పిన లెక్క‌ను త‌మ్ముడితో స‌రి చేసుకుంటున్నార‌ట‌.