ఆ నిర్మాత‌లు లెక్క స‌రిచేస్తున్నారా?

  • IndiaGlitz, [Monday,August 24 2020]

ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థ ఓ లెక్క‌ను స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇంత‌కూ ఏంటా లెక్క‌? అనే వివ‌రాల్లోకెళ్తే.. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ అఖిల్ అక్కినేనితో సినిమా చేయ‌డానికి ఓకే అంది. ఇందులో విష‌య‌మేముంది అనుకోకండి.. విష‌య‌మేమంటే, ఇదే బ్యాన‌ర్‌లో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగ‌చైత‌న్య సినిమా చేయాల్సింది. సినిమాను కూడా స్టార్ట్ చేశారు. కానీ.. పరుశురామ్‌కు, స‌ద‌రు నిర్మాణ సంస్థ‌కు మ‌హేశ్‌తో సినిమా చేసే అవ‌కాశం రావ‌డంతో చైతు సినిమాను ప‌క్క‌న పెట్టేశారు. ఈ విష‌యంపై నాగార్జున కాస్త సీరియ‌స్ అయ్యార‌ని కూడా వార్త‌లు వినిపించాయి.

అయితే ఇప్పుడు ఈ నిర్మాత‌లు నాగ్‌ను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అఖిల్ నెక్ట్స్ మూవీని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నార‌ట‌. నిజానికి ఈ చిత్రాన్ని క్రిష్‌, రాజీవ్ రెడ్డి నిర్మించాల్సింది. కానీ భారీ బ‌డ్జెట్ కార‌ణంగా క్రిష్‌, రాజీవ్ రెడ్డి త‌ప్పుకున్నారు. ఆ స్థానంలో ఇప్పుడు రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట సినిమాలు చేయ‌డానికి ముందుకు వ‌చ్చార‌ట‌. ఇలా అన్న‌తో త‌ప్పిన లెక్క‌ను త‌మ్ముడితో స‌రి చేసుకుంటున్నార‌ట‌.

More News

‘పుష్ప‌’.. సుక్కు మ‌రో ప్లాన్‌!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం ‘పుష్ప’.

ఇన్‌టెన్స్ థ్రిల్ల‌ర్‌గా సుమంత్ క‌ప‌టధారి.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

మళ్ళీరావా, సుబ్రహ్మణ్యపురం, ఇదంజ‌గ‌త్ .. ఇలా వ‌రుస హిట్ చిత్రాల‌తో హీరో సుమంత్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

ద‌స‌రాకి చిరు మ‌రో స్పెష‌ల్!!

తన పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 22) సంద‌ర్భంగా త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ సినిమా టైటిల్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

త్రివిక్ర‌మ్ టైటిల్ మారుస్తాడా?

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం.. షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ లుక్‌పై ద‌ర్శ‌క‌ధీరుడి క్లారిటీ!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’.