తమిళనాడులో వర్షాలకు ఘోరం.. 15 మంది మృతి

  • IndiaGlitz, [Monday,December 02 2019]

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో గత రెండ్రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాల థాటికి కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో నాలుగు భవనాలు కూప్పకూలాయి. ఈ ఘటనలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందారు. కాగా.. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 15 మంది చనిపోయారా..? లేకుంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా.. భారీవర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చెన్నై నగరంలోని షోజింగానల్లూర్, పల్లవరం, తంబారం, నన్ మంగళం, సెలియాయూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు వేల ఎకరాల్లో 5వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగి దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More News

నాగ్ సినిమాకి కొత్త హీరోయిన్

యాలిటీ షో బిగ్‌బాస్ 3ను కింగ్ నాగార్జున విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయ‌న త‌న ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడ‌ట‌.

'రూల‌ర్‌' కి ఓవ‌ర్‌సీస్ లో 'ఎన్టీఆర్' దెబ్బ?

ఇప్పుడు సినిమాలకు ఓవ‌ర్‌సీస్‌లో ఆద‌ర‌ణ బాగానే ఉంది. అయితే స్టార్ హీరోల సినిమాల‌కే అలాంటి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది.

షాద్‌నగర్‌ ఘటనపై కేసీఆర్ తీవ్ర ఆవేదన.. కఠిన చర్యలే!

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డాక్టర్ దారుణ హత్య: ప్రధాని మోదీకి కేటీఆర్ రిక్వెస్ట్!

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది.. వరాలే వరాలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా డైలాగ్స్ పేల్చారు. ఆదివారం నాడు ఇవాళ ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా విందు సమావేశం నిర్వహించారు.