15న 'రన్ రాజా రన్' ఆడియో

  • IndiaGlitz, [Friday,June 13 2014]
View Run Raja Run Movie Gallery

యువి క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మితమౌతోన్న సినిమా ‘రన్ రాజా రన్’. శర్వానంద్, సీరత్ కపూర్ హీరోహీరోయిన్స్. వి.వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. సుజిత్ దర్శకుడు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఘిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. లవ్, కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆడియో ఈ నెల15న విడుదలకానుంది.