close
Choose your channels

శ్రీలంకలో భారీగా బాంబు పేలుళ్లు..166మంది మృతి

Sunday, April 21, 2019 • తెలుగు Comments

రీలంకలో భారీగా బాంబు పేలుళ్లు.. 166మంది మృతి

శ్రీలంకలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 166 మంది మృతిచెందగా 400 మందికి పైగా గాయాలపాలయ్యారు. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆదివారం ఈస్టర్‌ సండే కావడంతో భక్తులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ భక్తులనే లక్ష్యంగా చేసుకున్న కొందరు దుండగులు దాడులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదయం నుంచి మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు మీడియాకు వివరించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఈ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలి..? ఏం చేయాలనే దానిపై శ్రీలంక ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. మరోవైపు భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.

పేలుళ్లు జరిగింది ఎక్కడ..?

కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బాంబులు పేలినట్లు అంతర్జాతీయ వెబ్‌సైట్లలో కథనాలు వస్తున్నాయి. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో ఇలా మొత్తం ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8.45 ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz