అయోధ్యలో కరోనా కలకలం.. పూజారి సహా 17 మందికి కరోనా..

  • IndiaGlitz, [Thursday,July 30 2020]

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు చూస్తున్న పూజారి సహా అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు మొత్తంగా 17 మందికి కరోనా సోకింది. అయోధ్య నిర్మాణానికి ఆగస్ట్ 5న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కలకలం రేగడం ఆందోళనకు దారి తీస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్న ప్రదీప్ దాస్ అనే అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రదీప్ దాస్‌తో పాటు ప్రస్తుతం రామ జన్మభూమి వద్ద భద్రతా విధుల్లో ఉన్న 16 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారంతా క్వారంటైన్‌‌లోకి వెళ్లిపోయారు. 5న జరగబోయే శంకుస్థాపన వేడకకు మోదీ, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 50 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

More News

ఏపీలో మోగిన ఉప ఎన్నిక నగారా..

ఏపీలో ఉప ఎన్నిక నగారా మోసింది. ఏపీ కౌన్సిల్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

దేశంలో షాకిచ్చిన కరోనా.. ఇంత పెద్ద మొత్తంలో కేసులు ఇదే తొలిసారి..

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు కరోనా కేసుల సంఖ్య షాకిచ్చింది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

తెలంగాణ కరోనా అప్‌డేట్.. ఇవాళ ఎన్నంటే..

తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలకూ కరోనా విస్తృతంగా వ్యాపించింది.

అన్‌లాక్ -3 మార్గదర్శకాలివే..

అన్‌లాక్-3కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసింది.

దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు.