'18 పేజిస్' చిత్రం నుండి క్లాసీ మెలోడీ 'నన్నయ్య రాసిన' లిరికల్ వీడియో విడుదల

  • IndiaGlitz, [Tuesday,November 22 2022]

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం 18 పేజిస్ నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ 18 పేజిస్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

తాజాగా 18 పేజిస్ చిత్రం నుండి నన్నయ్య రాసిన అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటను లిరిసిస్ట్ శ్రీమణి రచించారు.
ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన పాటై సాగేనా
నన్నయ్య రాసిన కావ్యమగితే, తిక్కన తీర్చేనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా
అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. నన్నయ్య రాసిన పాటను పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. ఈ పాట వినసొంపుగా ఉంది. ఖచ్చితంగా ఈ పాట మంచి మెలోడీ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదివరకే గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

More News

Dahini - Mantragatte: ఆస్ట్రేలియా టైటాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా ‘దహిణి - మంత్రగత్తె’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్ష‌ణ చిత్రం ‘దహిణి - మంత్ర‌గ‌త్తె’.

Meet Cute: 'మీట్ క్యూట్' ప్లెజంట్ వెబ్ సిరీస్ గా ఆకట్టుకుంటుంది - నాని

నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ మీట్ క్యూట్.

సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ 2022లో సోనూ సూద్ ప్రతిష్టాత్మక 'నేషన్స్ ప్రైడ్' అవార్డు

కోవిడ్ లాక్‌డౌన్‌ల సమయంలో వలస వచ్చినవారికి మెస్సీయగా ఉండటం నుండి పేదలు మరియు వైద్యం, విద్య మరియు ఉపాధి రంగాలలో

Dil Raju: హ్యాట్రిక్ హిట్ కొట్టిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్

Jaan Say: నూతన దర్శకుడు కిరణ్ కుమార్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా 'జాన్ సే'

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు.