నిర్మాత‌కు, రానా మ‌ధ్య బ‌య‌ట‌ప‌డ్డ విభేదాలు

  • IndiaGlitz, [Monday,October 28 2019]

విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా పేరు సంపాదించుకున్న అతి కొద్ది మంది ద‌క్షిణాది న‌టుల్లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. నేటి తరానికి చెందిన రానా, భాష‌ల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ త‌న మార్కెట్‌ను పెంచుకుంటూ వ‌స్తున్నాడు. అయితే గ‌త కొంత‌కాలంగా రానా సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడు. అందుకు ఆయ‌న అనారోగ్య‌మే కార‌ణ‌మ‌ని అంద‌రూ చెబుతున్నారు. ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే, రానా ఏడాదికి ముందు రెండో ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యంలో సాగే సైనికుడు ప్రేమ‌క‌థా చిత్రం '1945'లో న‌టిస్తున్న‌ట్లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌ళ్లీ ఎలాంటి స‌మాచారం లేదు. అయితే దీపావ‌ళి సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ‌కుమార్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసి మూడేళ్ల త‌ర్వాత త‌మ సినిమా పూర్త‌య్యిందంటూ లుక్‌తో పాటు మెసేజ్‌ను ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ రానా స్పందిస్తూ ''నేను సినిమాను పూర్తి చేయ‌నేలేదు. నేను ఆ ద‌ర్శ‌క నిర్మాతల‌ను క‌లుసుకుని ఏడాది దాటుతుంది. రెమ్యున‌రేష‌న్స్ విష‌యంలో తేడా వ‌చ్చింది. డ‌బ్బు కోసం నిర్మాత చేస్తున్న ప్ర‌య‌త్నం. ఎవ‌రు న‌మ్మ‌కండి'' అంటూ మెసేజ్ చేశాడు. దీనిపై నిర్మాత కూడా ఘాటుగా స్పందించాడు. ''60రోజుల పాటు షూటింగ్.. కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు పెట్టాం. అయినా సినిమా పూర్త‌య్యిందా? లేదా? అని డైరెక్ట‌ర్ మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌డు'' అంటూ మెసేజ్ పెట్టాడు. మ‌రి వ్య‌వ‌హారం ఎక్క‌డ‌కు చేరుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

దీపికా పాట‌కు మ‌హేశ్ కుమార్తె డ్యాన్స్‌

టాలీవుడ్ తార‌లు దీపావ‌ళి పండుగ‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రికీ శుభాకాంక్ష‌ల‌ను కూడా అంద‌జేశారు.

‘వంశీ.. ఏంటీ వాట్సాప్ న్యూసెన్స్.. రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు’!

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యనేత బోండా ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

'భీష్మ' ఫస్ట్ లుక్ విడుదల

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్

'అశ్వథ్థామ' ఫస్ట్ లుక్

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రీన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో

శివ‌జ్యోతి ఎలిమినేట్‌.. బిగ్‌బాస్‌పై హేమ సంచ‌లన‌ వ్యాఖ్య‌లు

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 3 ఆదివారంతో 14 వారాల‌ను పూర్తి చేసుకుంది. రానున్న ఆదివారంతో బిగ్‌బాస్ సీజ‌న్ 3 పూర్తి కానుంది.