close
Choose your channels

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 1986 కేసులు

Friday, July 31, 2020 • తెలుగు Comments

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ డబుల్ డిజిట్‌లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా హెల్త్ బులిటెన్‌ను శుక్రవారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 21,380 శాంపిళ్లను పరీక్షించగా.. 1986 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది.
కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 519కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 4,37,582 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా.. నేడు కూడా ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 586 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మేడ్చల్, మల్కాజ్‌గిరిలో 207 కేసులు రంగారెడ్డి జిల్లాలో 205 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Get Breaking News Alerts From IndiaGlitz