ప్రియ‌మ‌ణి పుట్టిన‌రోజు.. రెండు లుక్స్‌

  • IndiaGlitz, [Thursday,June 04 2020]

హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఇప్పుడు మ‌ళ్లీ బిజీగా మారుతుంది. పెళ్లికి ముందు క‌న్న‌డ చిత్ర‌సీమ‌కు మాత్ర‌మే ప‌రిమితమైన ప్రియ‌మ‌ణి కొంత‌కాలం ముందు జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ తెలుగులో బిజీగా మారుతుంది. తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు చిత్రాలు ప్రియ‌మ‌ణికి చాలా మంచి పేరుని తెచ్చే చిత్రాలే కావ‌డం విశేషం. అందులో ఒక‌టి విరాట‌ప‌ర్వం. రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈమె పాత్ర గురించి వినిపిస్తోన్న వార్త‌ల‌పై ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమాలో భార‌త‌క్క అనే న‌క్సలైట్ పాత్ర‌లో ప్రియ‌మ‌ణి న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

మ‌రో చిత్రం నార‌ప్ప‌. త‌మిళ చిత్రం అసుర‌న్‌కు ఇది తెలుగు రీమేక్‌. ఇందులో వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ను కూడా ప్రియ‌మ‌ణి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. వెంక‌టేశ్ భార్య పాత్ర‌లో ప్రియ‌మ‌ణి న‌టిస్తోంది. త‌మిళంలో మంజు భార్గ‌వి చేసిన పాత్ర‌ను తెలుగులో ప్రియ‌మ‌ణి చేసింది.

ఇలా పుట్టిన‌రోజు సందర్భంగా ప్రియ‌మ‌ణి న‌టిస్తోన్న రెండు సినిమాల‌కు ఫ‌స్ట్‌లుక్స్ విడుద‌లై అభిమానుల‌కు ఆనందాన్ని పంచాయి.

More News

మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్ గుర్రు.. తార‌క్‌కు ట్వీట్ పెట్టిన హీరోయిన్

ఎన్టీఆర్ అభిమానుల‌కు హీరోయిన్ మీరా చోప్రాపై కోపం వ‌చ్చింది. ఇప్పుడు ఉన్న సోష‌ల్ మీడియా ట్రెండ్‌లో అభిమానులు ఊరుకుంటారా?

చిరంజీవికి ఆ పెద్దరికం ఉంది:  ప్ర‌కాశ్‌రాజ్‌

ఉత్త‌ర‌, ద‌క్షిణాది చిత్రాల్లో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌. క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్‌ను విధించిన‌ప్పుడు చాలా మంది పేద‌ల‌కు ఆహారాన్ని అందించ‌డంతో పాటు..

గాంధీ సిద్ధాంతాల‌పై నాగబాబు ట్వీట్స్‌

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ మ‌ధ్య ట్విట్ట‌ర్‌లోయాక్టివ్‌గా ఉంటున్నారు. దీని ద్వారా ఆయ‌న విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. వివాదాల‌కు కేరాఫ్ అవుతున్నారు.

సిద్ధంగా ఉన్న జ‌క్క‌న్న‌..!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య ఏమ‌న్నారంటే..?

అగ్ర క‌థానాయ‌కుడు, ఎం.ఎల్‌.ఎ నంద‌మూరి బాల‌కృష్ణ సినీ ఇండ‌స్ట్రీలోని కొన్ని విష‌యాల గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.