Kedarnath chopper crash : ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన భక్తుల హెలికాఫ్టర్... ఆరుగురు దుర్మరణం

  • IndiaGlitz, [Tuesday,October 18 2022]

దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేదార్‌నాథ్ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాఫ్టర్ మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫటా హెలిప్యాడ్ నుంచి యాత్రికులను తీసుకెళ్తుండగా.. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలోని గరుడ్ ఛాటి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కాగా.. నలుగురు యాత్రికులుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

రెండు వారాల క్రితం లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 32 మంది మృతి:

ఇకపోతే.. రెండు వారాల క్రితం కూడా ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. నాటి ఘటనలో 32 మంది దుర్మరణం పాలవ్వగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. 55 మందితో ప్రయాణిస్తోన్న బస్సు పౌరీ జిల్లాలోని ధూమకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్ది గ్రామ సమీపంలో అదుపుతప్పి... లోతైన లోయలోకి దూసుకెళ్లింది. 500 మీటర్ల లోతైన లోయలో బస్సు పడటంతో ప్రమాద తీవ్రత అధికంగా వుంది. హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధాంగ్ నుంచి పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వీరంతా ఓ పెళ్లికి వెళ్తూ మృత్యువాతపడ్డారు.

More News

BiggBoss: ‘‘ అప్పుడేం పీకావ్ ’’.. శ్రీహాన్‌కి ఇచ్చిపడేసిన ఇనయా, ఈవారం నామినేషన్స్‌లో 13 మంది

బిగ్‌బాస్ 6 తెలుగు విజయవంతంగా ఏడో వారానికి చేరుకుంది. ఆదివారం సుదీప ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు కాస్త ఎమోషనల్‌ అయ్యారు.

Pawan Kalyan : గేర్ మార్చిన పవన్.. హైదరాబాద్‌కు కాదు, విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బెజవాడకు

వైసీపీ నేతలు జోగి రమేశ్, ఆర్కే రోజా, వైవీ సుబ్బారెడ్డిల కాన్వాయ్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడితో గత రెండు రోజులుగా

BiggBoss: సుదీప ఎలిమినేషన్... గీతూను ఆడేసుకున్నారుగా

అనుకున్నదే అయ్యింది బిగ్‌బాస్ నుంచి పీంకి సుదీప ఎలిమినేట్ అయ్యారు. ఈమె హౌస్‌ను వీడనుందని ముందే లీకైన సంగతి తెలిసిందే.

Bhaag Saale : 'భాగ్ సాలే' చిత్రం నుండి 'కూత రాంప్' పాట విడుదల!!

నేటి తరం యువత ని ఆకట్టుకునే సరికొత్త కథతో కొత్త దర్శకుడు ప్రణీత్ సాయి నేతృత్వంలో

Damayanti : విశ్వజీత్ హీరోగా 'కౌశిక వర్మ దమయంతి' టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌, ట్రైలర్‌ లాంచ్‌

విశ్వజీత్, అర్చ‌న‌, ఊర్వశి రాయ్ హీరో హీరోయిన్లుగా అంగారిక దియాన్‌ సమర్పణలో గురుదత్తా క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై