Download App

2015 - టాలీవుడ్ హీరోయిన్స్

టాలీవుడ్ 2015 - హీరోయిన్స్

2015 ముగియవస్తుంది..సినిమా సక్సెస్ రేట్, హీరో, హీరోయిన్స్, నటీనటులు అందరి కొలమానాన్ని లెక్కగడతారు. సినిమాల సక్సెస్ లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తారు. టాలీవుడ్ లో ఈ ఏడాది ముద్దుగుమ్మల ప్రయత్నాల వివరాలు ...

అనుష్క

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అనుష్క ఈ యేడు మూడు తెలుగు సినిమాల్లో నటించింది. బాహుబలి ది బిగినింగ్, రుద్రమదేవి చిత్రాలు మంచి సక్సెస్తో పాటు పేరుని తెస్తే సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఇరవై కిలోల బరువు కూడా పెరిగింది. అయినా సినిమా బాక్సాఫీస్ ముందు ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

సమంత

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి నటించిన చెన్నపొన్ను సమంత రెండు తమిళ చిత్రాల్లో కూడా నటించింది.

రకుల్ ప్రీత్ సింగ్

గతేడాది గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ రవితేజ కిక్2,రామ్ పండచేస్కో, రామ్చరణ్ బ్రూస్ లీ చిత్రాల్లో నటించింది. ఈ మూడు చిత్రాల్లో పండగచేస్కో కలెక్షన్స్ పరంగా ఊరటనిస్తే మిగిలిన రెండు సినిమాలు ప్లాప్ టాక్ను తెచ్చుకున్నాయి.

తమన్నా

ఈ ఏడాది మిల్కి బ్యూటీ రెండు తెలుగు సినిమాల్లో నటించింది. అందులో బాహుబలి ది బిగెనింగ్ సెన్సేషనల్ హిట్ కాగా, బెంగాల్ టైగర్ సూపర్హిట్ టాక్ను సంపాదించుకుంది.

నిత్యామీనన్

ఈ ఏడాది నిత్యామీనన్ ఐదు చిత్రాల్లో నటించింది. అందులో మూడు స్ట్రయిట్ సినిమాలు కాగా, రెండు డబ్బింగ్ సినిమాలు. బన్ని సరసన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేసింది. అలాగే రుద్రమదేవి చిత్రంలో నటించింది. శర్వానంద్తో మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రంలో హీరోయిన్గా నటించింది. మూడు సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అలాగే ఓకే కన్మణి, గంగ చిత్రాలు తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదలయ్యాయి. ఇవి కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నిత్యా సక్సెస్ రేట్ బావుంది.

రెజీనా కసండ్

సాయిధరమ్తో పిల్లానువ్వులేని జీవితం తర్వాత రెజీనా నటించిన చిత్రం సుబ్రమణ్యం ఫర్ సేల్ కమర్షియల్గా ఓకే అనిపించుకుంది. సౌఖ్యం డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది.

కాజల్ అగర్వాల్

ఎన్టీఆర్ సరసన టెంపర్లో నటించిన కాజల్ జయసూర్య అనే డబ్బింగ్ చిత్రంలో విశాల్ సరసన కూడా నటించింది.

లావణ్య త్రిపాఠి

లావణ్యకు ఈ ఏడాది లక్కీ ఇయర్గానే చెప్పవచ్చు. మారుతి దర్శకత్వంలో నానితో ఈ అమ్మడు నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. వచ్చే ఏడాదిన లచ్చిందేవికి ఓ లెక్కుంది, సొగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో సందడి చేయడానికి రెడీ అయింది.

రాశిఖన్నా

ఈ బొద్దుగుమ్మ ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటించింది. గోపీచంద్ సరసన జిల్, రామ్ సరసన శివమ్, రవితేజతో బెంగాల్ టైగర్ సినిమాలు చేసింది. ఇందులో బెంగాల్ టైగర్ సక్సెస్ అయిన మిగిలిన రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు.

తేజస్వి

చిన్న చితక పాత్రలతో సహా తేజస్వి ఈ సంవత్సరం ఐదు సినిమాలు చేసింది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కేరింత చిత్రాలు తేజస్వికి మంచి గుర్తింపును తెచ్చాయి. పండగచేస్కో, శ్రీమంతుడు చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. జత కలిసే చిత్రం డిసెంబర్ 25న విడుదలవుతుంది. ఇందులో హీరోయిన్గా నటించింది.

ప్రగ్యా జైశ్వాల్

వరుణ్తేజ్ సరసన ప్రగ్యా నటించిన చిత్రం కంచె. నటిగా ఈ సినిమా ఆమెకు మంచి పేరుని తెచ్చింది.

హేబాపటేల్

హేబా పటేల్ తొలి చిత్రం అలా ఎలా తర్వాత చేసిన చిత్రం కుమారి 21 ఎఫ్. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది.

శ్రియ శరన్

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటేసినా, వయసు మూడు పదులు దాటినా చెక్కు చెదని అందం శ్రియ సొంతం. ఈ ఏడాదిలో తెలుగులో గోపాల గోపాల సినిమా తప్ప శ్రియకు టాలీవుడ్లో అవకాశాలు రాలేదు. గోపాల గోపాల చిత్రంలో డీసెంట్ రోల్ చేసింది, టాలీవుడ్లో ఒక చిత్రంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నటించింది. వెంకీ భార్య పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది.

మాళవిక నాయర్

ఈ మలయాళ ముద్దు గుమ్మ నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నటించింది.

త్రిష

మూడు పదులు ముద్దుగుమ్మ బాలయ్య సరసన లయన్, కమల్ సరసన చీకటి రాజ్యం చిత్రాల్లో ఆకటట్టుకుంది.

చార్మి

ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలమైన ఛార్మి జ్యోతిలక్ష్మి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా నటిగా ఛార్మికి మంచి పేరుని తెచ్చింది. మంత్ర2 ప్లాప్ టాక్ మూటగట్టుకుంది.