తెలంగాణలో తాజాగా 2092 కరోనా కేసులు..

  • IndiaGlitz, [Thursday,August 06 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను గురువారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 21,346 శాంపిళ్లను పరీక్షించగా.. 2092 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,050కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 13 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం 589 మంది మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 20358 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1,289 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 52,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 535, మేడ్చెల్-126, రంగారెడ్డి-169, వరంగల్ అర్బన్-128, సంగారెడ్డి-100, నిజామాబాద్-91 కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇప్పటి వరకూ తెలంగాణలో 5,43,489 టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు.

సుశాంత్ సీబీకి.. ధృవీకరించిన సీబీఐ అధికార ప్రతినిధి

బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

‘జీ 5’లో జ్యోతిక, కార్తీ నటించిన ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్‌ సినిమాను ‘జీ 5’ ఒటీటీ తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది.

భారత్‌లో కరోనా.. డిశ్చార్జ్‌లలో ఇదే రికార్డ్..

భారత్‌లో రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే విశేషం ఏంటంటే..

'రాధాకృష్ణ' ఫస్ట్ లుక్ విడుదల

‘టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా, య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది, బొమ్మ‌న బ్రద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్ , ఢ‌మ‌రుకం’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో పాటు రీసెంట్‌గా