21న 'నా రాకుమారుడు'

  • IndiaGlitz, [Saturday,February 15 2014]

నవీన్ చంద్ర, రీతువర్మ జంటగా నటించిన సినిమా నా రాకుమారుడు. సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ను ఇచ్చింది. ఈ సినిమాను 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు. దాని తర్వాతే ఎవరి ప్రేమ అయినా, ఎవరి ప్రేమ అయినా. నేను నిజ జీవితంలో అలాగే భావిస్తాను. అలాంటి పాత్రనే ఈ సినిమాలోనూ చేస్తున్నాను అని అన్నారు. మంచి సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. మంచి సినిమాలో నటించడం తన అదృష్టమని రీతువర్మ చెప్పింది. పాటలకు మంచి స్పందన వస్తోందని, 21న సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.