close
Choose your channels

వైఎస్ జగన్ టీమ్ ఇదే.. మంత్రులుగా 25 మంది ప్రమాణం

Saturday, June 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ జగన్ టీమ్ ఇదే.. మంత్రులుగా 25 మంది ప్రమాణం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రిమండలి కొలువు దీరింది. కొత్తగా మంత్రులుగా ఎన్నికైన 25మంది ఎమ్మెల్యేలతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. సచివాలయంలో సీఎం చాంబర్‌ పక్కన ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లో సరిగ్గా 11:49 గంటలకు ఈ ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమై.. 12:45 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమానికి 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రమాణం చేసిన మంత్రులు వీరే...

1. ధర్మానకృష్ణదాస్- నరసన్నపేట(శ్రీకాకుళం)


2. బొత్స సత్యనారాయణ - చీపురుపల్లి(విజయనగరం)


3. పుష్ప శ్రీవాణి- కురుపాం (విజయనగరం)


4. ముత్తంశెట్టి శ్రీనివాసరావు - భీమిలి(విశాఖపట్టణం)


5. కురసాల కన్నబాబు - కాకినాడ రూరల్(తూర్పుగోదావరి)


6. పిల్లి సుభాష్ చంద్రబోస్- మండపేట (ఎమ్మెల్సీ కోటా)


7. పినిపే విశ్వరూప్- అమలాపురం(తూర్పుగోదావరి)


8. ఆళ్ల నాని- ఏలూరు(పశ్చిమగోదావరి)


9. శ్రీరంగనాథ రాజు- ఆచంట(పశ్చిమగోదావరి)


10. తానేటి వనిత- కొవ్వూరు(పశ్చిమగోదావరి)


11. కొడాలి నాని- గుడివాడ(కృష్ణాజిల్లా)


12. పేర్ని నాని - మచిలీపట్నం(కృష్ణాజిల్లా)


13. వెల్లంపల్లి శ్రీనివాస్- విజయవాడ వెస్ట్(కృష్ణాజిల్లా)


14. మేకతోటి సుచరిత - ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా)


15. మోపిదేవి వెంకటరమణ (ఎమ్మెల్సీ కోటా)


16. బాలినేని శ్రీనివాసరెడ్డి - ఒంగోలు(ప్రకాశం జిల్లా)


17. ఆదిమూలపు సురేష్ - యర్రగొండెపాలెం(ప్రకాశం జిల్లా)


18. అనిల్‌కుమార్ యాదవ్ - నెల్లూరు సిటీ(నెల్లూరు జిల్లా)


19. మేకపాటి గౌతమ్‌రెడ్డి - ఆత్మకూరు(నెల్లూరు జిల్లా)


20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పుంగనూరు(చిత్తూరు జిల్లా)


21. కలత్తూరు నారాయణస్వామి- గంగాధర నెల్లూరు(చిత్తూరు జిల్లా)


22. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి - డోన్(కర్నూలు జిల్లా)


23. గుమ్మనూరు జయరాం - ఆలూరు(కర్నూలు జిల్లా)


24. అంజాద్ బాషా- కడప(వైఎస్సార్ కడప జిల్లా)


25. ఎం. శంకర్ నారాయణ- పెనుకొండ(అనంతపురం జిల్లా)

కాగా.. జగన్ కేబినెట్‌లో ముగ్గురు ‘నాని’లకు చోటు దక్కడం విశేషం. ఆళ్ల నాని (ఏలూరు), పేర్ని నాని (మచిలీపట్నం), కొడాలి నాని(గుడివాడ). వీరందరికీ ఏయే శాఖలు కేటాయిస్తారనే విషయం ఇవాళ సాయంత్రం తెలియనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.