బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ..

  • IndiaGlitz, [Thursday,March 14 2024]

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో 72 మంది అభ్యర్థులకు చోటు కల్పించింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజా జాబితాలో మరో 6 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. దాద్రా నగర్ హవేలి, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఇందులో స్థానం కల్పించారు.

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గోడం నగేష్‌‌, మెదక్ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు అవకాశం దక్కింది. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి డీకే అరుణ పేరును ఖరారు చేశారు. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీతారాం నాయక్ పోటీ చేయనున్నారు. ఇక నల్గొండ స్థానం నుంచి సైదిరెడ్డి.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు రెండు జాబితాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకే ఎక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం.

తాజా జాబితా పరిశీలిస్తే హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, నాగ్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముంబై నార్త్‌ నుంచి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, హవేరీ నుంచి కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై, బెంగళూరు సౌత్‌ నుంచి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇక ఇటీవల హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌కు లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. కర్నాల్ నియోజకవర్గం నుంచి ఖట్టర్‌ లోక్‌సభ బరిలో నిలిచారు. అలాగే ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు హర్‌ద్వార్ టికెట్ కేటాయించారు.

ఇదిలా ఉంటే తొలి జాబితాలో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి భరత్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్‌లకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 267 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

More News

Aroori Ramesh: తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు: ఆరూరి రమేష్

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆరూరి రమేష్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆయన సమావేశం అయ్యారు.

Chandrababu: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా అప్పుడే ప్రకటిస్తాం: చంద్రబాబు

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో అన్ని పార్టీలు యుద్ధానికి సిద్ధమయ్యాయి.

Harish Shankar: 'ఉస్తాద్ భగత్‌సింగ్' ఐదు రోజులే షూటింగ్ చేశాం.. హరీష్ కామెంట్స్..

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన కటిమ్ అయిన సినిమాల షూటింగ్ వాయిదాపడింది. ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా ఉంది.

Electoral bonds: 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలు.. సుప్రీంకోర్టులో SBI అఫిడవిట్..

ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు దెబ్బకి ఎట్టకేలకు SBI దొగొచ్చింది. న్యాయస్థానం చెప్పిన గడువులోగా బాండ్స్ వివరాలు సమర్పించింది. ఈ మేరకు కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

Mudragada: వైసీపీలోకి ముద్రగడ చేరిక వాయిదా.. ఎందుకంటే..?

కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వాయిదాపడింది. గురువారం తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.