close
Choose your channels

ధృవ టీజర్ - 3 మిలియన్స్ రికార్డ్..!

Monday, October 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నధృవ టీజ‌ర్ ను ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేసారు.
నీ స్నేహితుడు ఎవ‌రో తెలిస్తే...నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది. నీ శ‌త్రువు ఎవ‌రో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది అంటూ రామ్ చ‌ర‌ణ్ వాయిస్ తో ఉన్న టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. వారం రోజుల్లో ఈ టీజ‌ర్ ను 30 ల‌క్ష‌ల మంది చూడ‌డం విశేషం. త‌ని ఓరువ‌న్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.