close
Choose your channels

రెండు సినిమాలతో.. రూ.30 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్న భామ!

Saturday, January 18, 2020 • తెలుగు Comments

రెండు సినిమాలతో.. రూ.30 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్న భామ!

సారా అలీఖాన్.. సైఫ్ అలీఖాన్ కూతురు. స్టార్ నటుడి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. చేసినవి రెండు సినిమాలే. అయినా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. కేథార్ నాథ్, సింబా చిత్రాల్లో సారా గ్లామర్‌కు ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. సినీ అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దీంతో పాటు పలు వాణిజ్య ఉత్పత్తుల సంస్థలు తమ యాడ్‌లలో నటించమంటూ ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. గ్రానియర్, వివో, ఫాంటా, పూమా లాంటి కంపెనీలు కనకవర్షం కురిపించడానికి రెడీ అవుతున్నాయి.

ఈ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని పోరుబెడుతున్నాయట. ఈ ముద్దుగుమ్మ సుమారు రూ. 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాయని సమాచారం. దీపిక, కత్రినా, అలియా లాంటి స్టార్ హీరోయిన్లను కాదని ఈ బ్యూటీకే ఓటు వేయడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది. బాలీవుడ్‌లో వారసుల హవా ఉంటుందని తెలుసుకానీ.. ఇంత తక్కువ వ్యవధిలో ఇంతలా పాపులారిటీ సంపాదించుకున్న నటిలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈమె న‌టిస్తోన్న `ల‌వ్ ఆజ్ క‌ల్‌` సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. తండ్రి సైఫ్ ఆలీఖాన్ గ‌తంలో ల‌వ్ ఆజ్ క‌ల్ పేరుతో సినిమా చేశాడు. ఇప్పుడు అదే టైటిల్‌తో రూపొందుతోన్న చిత్రంలో కుమార్తె న‌టించ‌డం విశేషం.

Get Breaking News Alerts From IndiaGlitz