రెండు సినిమాలతో.. రూ.30 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్న భామ!

  • IndiaGlitz, [Saturday,January 18 2020]

సారా అలీఖాన్.. సైఫ్ అలీఖాన్ కూతురు. స్టార్ నటుడి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. చేసినవి రెండు సినిమాలే. అయినా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. కేథార్ నాథ్, సింబా చిత్రాల్లో సారా గ్లామర్‌కు ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. సినీ అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దీంతో పాటు పలు వాణిజ్య ఉత్పత్తుల సంస్థలు తమ యాడ్‌లలో నటించమంటూ ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. గ్రానియర్, వివో, ఫాంటా, పూమా లాంటి కంపెనీలు కనకవర్షం కురిపించడానికి రెడీ అవుతున్నాయి.

ఈ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని పోరుబెడుతున్నాయట. ఈ ముద్దుగుమ్మ సుమారు రూ. 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాయని సమాచారం. దీపిక, కత్రినా, అలియా లాంటి స్టార్ హీరోయిన్లను కాదని ఈ బ్యూటీకే ఓటు వేయడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది. బాలీవుడ్‌లో వారసుల హవా ఉంటుందని తెలుసుకానీ.. ఇంత తక్కువ వ్యవధిలో ఇంతలా పాపులారిటీ సంపాదించుకున్న నటిలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈమె న‌టిస్తోన్న 'ల‌వ్ ఆజ్ క‌ల్‌' సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. తండ్రి సైఫ్ ఆలీఖాన్ గ‌తంలో ల‌వ్ ఆజ్ క‌ల్ పేరుతో సినిమా చేశాడు. ఇప్పుడు అదే టైటిల్‌తో రూపొందుతోన్న చిత్రంలో కుమార్తె న‌టించ‌డం విశేషం.

More News

నాన్న, నా అభిమానుల కోరికను నెరవేర్చిన అనిల్ రావిపూడికి  థ్యాంక్యూ- మహేశ్ బాబు

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌సమర్పణలోజి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో

రోజాపై అనసూయ సెటైర్.. నెట్టింట జోకులే జోకులు

జబర్దస్త్ షోతో అనసూయ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయంటే..

నేనైతే ఆ పని చేయను.. దీపికపై కంగనా ఫైర్.!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, కంగనా రనౌత్ సినిమాలకే కాదు.. సామాజిక అంశాల్లోనూ చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే.

పవన్ 'పింక్' రిలీజ్ ఖరారైందా?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి కీర్తి సురేష్ ఔట్‌!!

మ‌హానటితో ద‌క్షిణాదిలో హీరోయిన్ త‌నేంటో ప్రూవ్ చేసుకున్న కీర్తిసురేష్‌.. ఇప్పుడు హిందీలోకి `మైదాన్‌` సినిమాతో ఎంట్రీ ఇస్తున్నానని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.