వెంకటేష్ శ్రీనివాస కళ్యాణంకి 30 ఏళ్లు

  • IndiaGlitz, [Monday,September 25 2017]

యువ చిత్ర సంస్థ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. ఆ సినిమా కచ్చితంగా మ్యూజిక‌ల్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉండేది అప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు. దానికి త‌గ్గ‌ట్టే ఆ సంస్థ అధినేత కె.మురారి చివ‌రి వ‌ర‌కు అలాంటి మ్యూజిక‌ల్ హిట్స్ ని ఇచ్చి మురిపించారు. ఆయ‌న నిర్మించిన దాదాపు ప్ర‌తి చిత్రానికి కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీత‌మందించారు. అలా కె.మురారి, కె.వి.మ‌హ‌దేవ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఓ మ్యూజిక‌ల్ హిట్ శ్రీ‌నివాస క‌ళ్యాణం.

వెంక‌టేష్‌, భానుప్రియ‌, గౌత‌మి హీరోహీరోయిన్లుగా కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ యువ చిత్ర వారి సినిమా.. మ్యూజిక‌ల్‌గానే కాదు క‌మ‌ర్షియ‌ల్‌గానూ మంచి హిట్ అయ్యింది. ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ముగ్గురూ త‌మ న‌ట‌న‌తో సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకువెళ్లారు. కె.వి.మ‌హ‌దేవ‌న్ అందించిన పాట‌లన్నీ ఆణిముత్యాలే. ఎందాకా ఎగిరేవ‌మ్మా గోరింకా, తుమ్మెదా ఓ తుమ్మెదా పాట‌లైతే సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. 30 ఏళ్ల క్రితం అంటే.. 1987లో ఇదే సెప్టెంబ‌ర్ 25న ఈ సినిమా విడుద‌లైంది.

More News

అక్టోబ‌ర్ 1న 'సాయి నీ లీల‌లు' పాట‌లు రికార్డింగ్ ప్రారంభం

క‌రుణామ‌యుడిగా, వేమ‌న‌గా, ఆంద్ర‌కేస‌రిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయిన న‌ట పిపాసి విజ‌య్ చంద‌ర్. తాజాగా ఆయ‌న అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు, స‌చ్చిదానంద స‌మ‌ర్ధ స‌ద్గురువుగా భ‌క్తుల‌చే కీర్తించ‌బ‌డే శ్రీ షిరిడి సాయినాధుని క‌థ‌ను 'సాయి నీ లీల‌లు' టైటిల్ తో తెర‌కెక్కుతోన్న చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసింద

త్రివిక్రమ్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అదేనా?

జైలవకుశ లో మూడు విభిన్న పాత్రలు చేసి మెప్పించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

హ్యాట్రిక్ కొట్టనున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జైలవకుశ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా..

ఆ క్రెడిట్ మహేష్ దే

ఓవర్ సీస్ లో సూపర్ స్టార్ మహేష్బాబుకి ఉన్న క్రేజే వేరు.సినిమా ఎలా ఉన్నా..

పారిస్ పారిస్ అంటున్న కాజల్

ఖైదీ నెం.150,నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో ఈ ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంది టాలీవుడ్ చందమామ కాజల్.