close
Choose your channels

అఫీషియ‌ల్‌... '2.0' టీజ‌ర్ డేట్‌

Friday, September 7, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అఫీషియ‌ల్‌... 2.0 టీజ‌ర్ డేట్‌

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. శంక‌ర్ గ‌త చిత్రం 'ఐ'లో క‌థానాయిక‌గా న‌టించిన ఎమీ జాక్స‌న్ ఇందులో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ ఏడాది న‌వంబ‌ర్ 29న `2.0`న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ టీజ‌ర్ 2డి, 3డి వెర్ష‌న్స్‌లో ఉంటుంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌కు సంబంధించి అధికారిక స‌మాచారాన్ని ప్ర‌క‌టించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని హిందీ వెర్ష‌న్‌లో క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల చేయ‌బోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.