'ఆటోనగర్' మరోసారి వెనక్కి?

  • IndiaGlitz, [Saturday,February 01 2014]

దేవాకట్టా డైరెక్షన్ లో యువ సామ్రాట్ నాగచైతన్య ,సమంత జంటగా నటించిన సినిమా 'ఆటోనగర్ సూర్య.' అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇటీవల విడుదలైన ఆడియో మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలౌతుందని, అందుకు తగిన సన్నాహాలు చేసిన నిర్మాతలు ఆర్.ఆర్.మూవీస్ మరో సారి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారట.

ఆర్.ఆర్. మూవీస్ నిర్మాణంలో చాలా రోజులుగా ఆగిపోయిన పైసా వాయిదాను క్లియర్ చేయడానికి నాగచైతన్య సినిమాని పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారని సమాచారం. మరి అధికారకంగా ఎటువంటి సమాచారం లేదు. చూడాలి మరి....