'కిక్-2' కాదట

  • IndiaGlitz, [Wednesday,May 28 2014]
View Ravi Teja Gallery

నందమూరి కల్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణంలో ఓ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మే 28న సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్టు అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత కల్యాణ్ రామ్ మాట్లాడుతూ తాతగారి పేరు మీద స్టార్ట్ చేసిన బ్యానర్ లో ఆయన జయంతి సందర్భగా మరో సినిమాని అనౌన్స్ చేస్తున్నాం. రవితేజ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. జూన్, జూలైలో సినిమాని ప్రారంభిస్తాం. ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇది ‘కిక్’ సినిమాకి సీక్వెల్ మూవీ కాదు’’ అన్నారు.