'జన్మస్థానం' పాటల విడుదల

  • IndiaGlitz, [Monday,June 23 2014]

కృష్ణచంద్ర, షమాసింగ్, పావని, రూపిక నటీనటులుగా భరత్ కలర్ ల్యాబ్ సమర్పణలో సువన్ రాయ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా జన్మస్థానం. సాయికుమార్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. కె.రాయన్న నిర్మాత. ఓంసాయిప్రకాష్ దర్శకుడు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల హైదరాబాద్ లో జరిగింది. వీరశంకర్ బిగ్ సీడీని ఆవిష్కరించారు. సుద్దాల ఆశోక్ తేజ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...

చిత్ర దర్శకుడు ఓం సాయిప్రకాష్ మాట్లాడుతూ 'స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా. సామాజికి అంశంతో తెరకెక్కతుంది. తెలుగు, కన్నడంలో చేస్తున్నాం. నిర్మాత సహకారం మరువలేనిది. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా'' అని తెలిపారు.

చిత్ర నిర్మాత కె.రాయన్న మాట్లాడుతూ 'సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా అనుకున్నట్టుగానే చక్కగా వచ్చింది'' అన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

More News