'ప్రేమ ఇష్క్...' కు ఎ సర్టిఫికేట్

  • IndiaGlitz, [Saturday,November 30 2013]

లక్కీ మీడియా బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమా 'ప్రేమ ఇష్క్ కాదల్.'. హర్షవర్ధన్ రాణే, విష్ణు వర్ధన్, హరీష్ వర్మ, వితిక, శ్రీముఖి, రీతూ వర్మ నటీనటులు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. పవన్ సాధినేని దర్శకుడు. శ్రవణ్ సంగీత దర్శకుడు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఎ సర్టిఫికేట్ పొందిందట.. మూడు జంటల మధ్య జరిగే ప్రేమ కథగారూపొందిన ఈ సినిమాకి నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చాడట..