'మహారథి' తరువాత 'లెజెండ్'

  • IndiaGlitz, [Thursday,November 14 2013]

హెవీ ఎక్స్ పెక్టేషన్స్ తో రూపొందుతున్న బాలకృష్ణ సినిమా 'లెజెండ్'. 'సింహా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమా ఇది. భారీ వ్యయంతో రూపొందుతున్న సినిమాగా 'లెజెండ్' ఏదో ఒక రూపంలో ఈ మధ్య వార్తల్లో కెక్కుతోంది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. బాలకృష్ణ, దేవిల కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే.

ఇదిలా ఉంటే.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'లెజెండ్' ని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే గనుక నిజమైతే బాలకృష్ణ నటించిన 'మహారథి' తరువాత ఫిబ్రవరి మొదటివారాన్ని ముహుర్తంగా కుదుర్చుకుని వస్తున్న బాలకృష్ణ సినిమా 'లెజెండ్'నే అవుతుంది. గతంలో ఇదే ఫిబ్రవరిలో బాలయ్య నుంచి 'ముద్దుల మావయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలు సైతం వచ్చాయి.