'రుబాబు' చేయనున్న ఎన్టీఆర్

  • IndiaGlitz, [Sunday,June 08 2014]
View NTR Junior Gallery

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. పరమేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో బండ్లగణేష్ నిర్మాతగా సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘రభస’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా పూర్తి కాగానే పూరి జగన్నాథ్ సినిమా ప్రారంభం అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘రుబాబు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.